Friday, February 10, 2017

               హాలీవుడ్ పై కన్నేసిన నెరజాన..


సినిమా పిల్లర్- అందాల భామ మీరా చోప్రా గుఇర్తుంది కదా.. తెలుగులో అప్ప్లో పవన్ కళ్యాణ్ కరసన బంగారం సినిమాలో నటించింది. ఆ తర్వాత జగన్మోహిని సినిమాలో నటించినా పెద్దగా ఆఫర్స్ రాలేదు. తెలుగు, తమిళ భాషల్లో ఈ అమ్మడుకి ఐరన్ లెగ్ అనే ట్యాగ్ వచ్చింది. చేసిన సినిమాలకంటే....వివాదాలే ఎక్కువ కావడమే ఇందకు కారణమని చెప్పవచ్చు. ప్రస్తుతం బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న మీరా చోప్రా, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకి బంధువు.
ఈ బంధుత్వంతోనే, ప్రియాంక చోప్రా హాలీవుడ్ కి తీసుకేలుతుందట మీరా చోప్రా ని. క్వాంటికో అనే టీవీ షోలో ప్రియాంక నటిస్తుండగా, అలాంటిదే మరో అవకాశం తన వద్దకు వచ్చే సరికి, దాన్ని మీరా చోప్రాకి ఇవ్వాలని అనుకుంటుందట ప్రియాంక. అక్క ఇప్పటికే తనను హాలీవుడ్ కు తీసుకెళ్తోందంటూ మీరా చోప్రా ఎగిరి గంతేస్తుంది. బాలీవుడ్‌ లో ఇప్పటికే ఒకటీ అరా సినిమాల్లో చేసినా మీరా చోప్రాకి.. అక్కడా పరిస్థితి ఏమంత గొప్పగా లేదు.
ఐతే గ్లామర్‌ విషయంలో మొహమాటాలేమీ లేవుగానీ, దర్శక నిర్మాతల్ని తన అహంకారంతో వేధింపులకు గురిచేయడమే మీరా చోప్రా బ్యాడ్‌ హ్యాబిట్‌ అనీ, అదే ఆమెను హీరోయిన్‌ గా ఎదగనీయకుండా చేస్తోందన్న విమర్శలున్నాయి. మరి అక్క దయతో హాలీవుడ్‌ లోకి అడుగు పెడ్తున్న మీరా, అక్కడన్నా పద్ధతిగా నడుచుకుంటుందా అన్నదే ఆసక్తికరంగా మారింది.


No comments:

Post a Comment