
సినిమా పిల్లర్- అందాల భామ మీరా చోప్రా గుఇర్తుంది కదా.. తెలుగులో అప్ప్లో పవన్ కళ్యాణ్ కరసన బంగారం సినిమాలో నటించింది. ఆ తర్వాత జగన్మోహిని సినిమాలో నటించినా పెద్దగా ఆఫర్స్ రాలేదు. తెలుగు, తమిళ భాషల్లో ఈ అమ్మడుకి ఐరన్ లెగ్ అనే ట్యాగ్ వచ్చింది. చేసిన సినిమాలకంటే....వివాదాలే ఎక్కువ కావడమే ఇందకు కారణమని చెప్పవచ్చు. ప్రస్తుతం బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న మీరా చోప్రా, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకి బంధువు.
ఈ బంధుత్వంతోనే, ప్రియాంక చోప్రా హాలీవుడ్ కి తీసుకేలుతుందట మీరా చోప్రా ని. క్వాంటికో అనే టీవీ షోలో ప్రియాంక నటిస్తుండగా, అలాంటిదే మరో అవకాశం తన వద్దకు వచ్చే సరికి, దాన్ని మీరా చోప్రాకి ఇవ్వాలని అనుకుంటుందట ప్రియాంక. అక్క ఇప్పటికే తనను హాలీవుడ్ కు తీసుకెళ్తోందంటూ మీరా చోప్రా ఎగిరి గంతేస్తుంది. బాలీవుడ్ లో ఇప్పటికే ఒకటీ అరా సినిమాల్లో చేసినా మీరా చోప్రాకి.. అక్కడా పరిస్థితి ఏమంత గొప్పగా లేదు.
ఐతే గ్లామర్ విషయంలో మొహమాటాలేమీ లేవుగానీ, దర్శక నిర్మాతల్ని తన అహంకారంతో వేధింపులకు గురిచేయడమే మీరా చోప్రా బ్యాడ్ హ్యాబిట్ అనీ, అదే ఆమెను హీరోయిన్ గా ఎదగనీయకుండా చేస్తోందన్న విమర్శలున్నాయి. మరి అక్క దయతో హాలీవుడ్ లోకి అడుగు పెడ్తున్న మీరా, అక్కడన్నా పద్ధతిగా నడుచుకుంటుందా అన్నదే ఆసక్తికరంగా మారింది.
సినిమా పిల్లర్- దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోను వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు శృతి హాసన్. ఈ భామ హీరో సూర్యతో కలసి నటించిన ఎస్ 3 రేపు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సందర్భంగా ఆమె మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.తన మనసుకు అనిపించింది భయం లేకుండా చేస్తానని, ఎదుటివారి నుంచి ప్రశంసలు ఆశించకుంటే విమర్శలను, సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు అని చెప్పింది. అలాగే తనకు పెళ్లి అయినా కూడా సినిమాల్లో నటిస్తానని, నటన కూడా ఓ వృత్తి లాంటిదే అని తెలిపింది. భర్త చెప్పాడనో, అత్త నో అందనో నటనను త్యాగం చేయకూడదని అభిప్రాయపడింది. తనకు పెళ్లైనా, తాను పిల్లల తల్లైనా కూడా నటిస్తానని, నటన అంటే తనకు అమితమైన ఇష్టమని చెప్పిందీ సొగసరి జాన.

సినిమా పిల్లర్- తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ఎస్-3 (సింగం-3)సినిమా తమిళ వెర్షన్ ప్రపంచం వ్యాప్యంగా విడుదలైంది. ఐతే కొన్ని సాంకేతిక కారణాలవల్ల తెలుగులో సింగం-3 విడుదల కాలేదు. తమిళ్ వెర్షన్ ఎస్ 3 రివ్యూ మీకోసం...
సినిమా పేరు-ఎస్-3 (యముడు 3)
తారాగణం- సూర్య, అనుష్క, శ్రుతిహాసన్, రాధిక, క్రిష్, నీతూచంద్ర తదితరులు
సంగీతం- హారిస్ జయరాజ్
దర్శకత్వం- హరి
న్యూస్ పిల్లర్ రేటింగ్- 7/10
పరిచయం......
సీక్వెల్స్ ట్రెండ్ తమిళ.. తెలుగు ప్రేక్షకులకు కొత్తేం కాదు. అయితే ఓ సిరీస్ గా సినిమాలు రావడం మాత్రం నిజంగానే కాస్త అరుదని చెప్పవచ్చు. ఒకే కథానాయకుడు, ఒకే దర్శకుడు, ఇంచుమించుగా అదే తారాగణంతో వరుసగా సినిమాలు చేయడం రేరే కదా. సూర్య.. హరి కాంబినేషన్ లో మాత్రం వరుసగా ఇలా సినిమాలొస్తున్నాయి. ‘సింగం’ అనే టైటిల్ ని ఓ బ్రాండ్ గా మార్చుకొన్నారు లీరు. ఈ సిరీస్ లో వచ్చిన రెండు చిత్రాలూ మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రం ‘ఎస్ 3’ తెలుగులో ‘యముడు 3’ పేరుతో విడుదలైంది. మరి ఈసారి ఈ పోలీస్ సింహం సృష్టించిన హంగామా ఎలా ఉంది.. మాస్ ని ఎంతవరకూ అలరించింది.. అన్నది చూస్తే..
ఎస్-3 కధ....
సింగం సిరీస్ తొలి భాగం ‘సింగం’ పల్లెటూరి నేపథ్యంలో సినిమా సాగుతుంది. తర్వాత భాగం ‘సింగం 2’ సింగం (సూర్య) పట్టణానికి వస్తాడు. మూడో భాగం ‘సింగం 3’లో పట్టణం నుంచి ఆస్ట్రేలియా వెళ్తాడు. ఒక పోలీసు కమిషనర్ హత్యకు సంబంధించిన విచారణ చుట్టూ సాగే కథ ఇది. నిజాయతీ గల పోలీసు అధికారి సిడ్నీలో ఇండియన్ పోలీసు పవర్ ఎలా చూపించాడన్నదే ఎస్ -3 కథ. కథలో కావ్య (అనుష్క).. విద్య (శ్రుతిహాసన్)ల మధ్య ఉన్న సంబంధం ఏంటి అన్నది కూడా ఆసక్తికరంగా సాగుతుంది.
ఎస్-3 కధనం.....
ఈ సినిమా కేవలం యాక్షన్ ప్రియుల్ని దృష్టిలో ఉంచుకునే తీర్చిదిద్దారు దర్శకుడు హరి. అందుకు సంబంధించిన సన్నివేశాలు మాస్ ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. సూర్య పవర్ ఫుల్ డైలాగ్ లు.. మేనరిజం.. ఫైట్లపై దర్శకుడు దృష్టి పెట్టారు. తొలి భాగం నిదానంగా సాగుతుంది. అనవసరంగా ఇరికించిన కామెడీ సన్నివేశాలు కాస్త ఇబ్బంది పెడతాయి. అనుష్క.. సూర్యల మధ్య నడిపించిన ట్రాక్ కూడా కథలో ఇమడనట్లుగా ఉందనిపిస్తుంది.
విశ్రాంతికి ముందు నుంచి థ్రిల్ కలిగించే సన్నివేశాలు మొదలవుతాయి. దాంతో ప్రేక్షకుడికి ఆసక్తి మొదలవుతుంది. ఆ నేపథ్యంలో వచ్చే పోరాట ఘట్టాలు అలరిస్తాయి. ద్వితీయార్ధం ప్రారంభంలో సన్నివేశాల్ని పరుగులు పెట్టించాడు దర్శకుడు. సిడ్నీ నేపథ్యంలో సాగిన యాక్షన్ ఘట్టాలు ఆకట్టుకుంటాయి. ఛేజింగ్‌లు.. సూర్య చేసిన ఫైట్లు.. పోలీసు పవర్‌ను చూపించిన డైలాగ్‌లు ఇవన్నీ కలిసి ఓ యాక్షన్ ప్యాకేజీలా దర్శకుడు చూపించాడు.
ఆస్ట్రేలియాలో జరిగే సన్నివేశాలు సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. మొత్తంగా చూస్తే ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం పట్టుగా సాగింది. కాకపోతే దర్శకుడు తొలి రెండు భాగాల్లో చూపించిన చాకచక్యం ఈ సినిమాలో చూపించలేకపోయాడు. కథ బలహీనంగా ఉండటం.. హీరో పాత్రపై తప్ప మరే పాత్రపైనా దృష్టి పెట్టకపోవడం నిరాశకు గురి చేస్తాయి. ‘వైఫై..’ పాట కోసం మాత్రమే శ్రుతిహాసన్‌ను తీసుకున్నారా.. అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు మామూలుగా సాగాయి.
నటీనటుల పనితీరు..........
ఇక ఎప్పటిలాగే సూర్య కోసమే ఈ సినిమా తీశారా.. అనేలా ఉంది. మరోసారి శక్తిమంతమైన పోలీసు పాత్రలో సూర్య రాణించారు. సూర్య గెటప్.. తను చేసిన పోరాట దృశ్యాలు ఆకట్టుకుంటాయి. అనుష్క మరీ లావుగా కనిపించింది. ఈ విషయంలో తాను జాగ్రత్తలు తీసుకుని ఉంటే బావుండేది. పైగా ఆమె పాత్రకు అంత ప్రాముఖ్యత లేదు. శ్రుతిహాసన్ ది కేవలం గ్లామర్ పాత్ర మాత్రమే. విలన్ పాత్రల్ని పోషించిన వారిని దర్శకుడు స్టైలిష్ గా చూపించాడు. మరోవైపు సీనియర్ నటి రాధిక నటన ఆకట్టుకుంటుంది.